Homeపొలిటికల్బటన్ల కింద ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆంధ్రా !

బటన్ల కింద ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆంధ్రా !

jagan 2

జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశాక, మన రాజ్యాంగంలో ఒక మార్పు చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఓటు హక్కు అనేది కేవలం తెలివైన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని ఓ రాజ్యాంగ భరతమైన షరతు పెట్టాలి. నిజమే ఈ ఆలోచన కచ్చితంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమే. కానీ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే.. ఆ ప్రజాస్వామ్యంలో మార్పులు చేయక తప్పని పరిస్థితి. జగన్ రెడ్డి ఒక్కసారి గెలిస్తేనే.. పాలన ఇంత దారుణంగా ఉంది అంటే.. ఇక జగన్ రెడ్డి గనుక మళ్లీ అధికారంలోకి వస్తే ?, ఏమిటి ప్రజల పరిస్థితి ?, ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు ?, అసలు రాష్ట్రం అనేది ఉంటుందా ?, ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉంది అని చరిత్రలో చదువుకోవాల్సి వస్తోందా ?. ఏమో.. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే.. ఇది అసలు మన రాష్ట్రమేనా ? అని అనుమానం కలుగుతుంది.

ఆంధ్రా వాడిని ఎడారిలో పడేసినా వాటర్ ప్లాంట్ పెట్టుకుని ఎడారి ప్రయాణికులకు దాహం తీరుస్తాడు, ఇది ఒకప్పటి ఆంధ్రుడి కథ. ఇప్పుడు ఇసుక తిని చనిపోతాడేమో. లేకపోతే.. ఎవరో ఒకరు వస్తారు అని ఎదురు చూస్తూ చనిపోతాడేమో. అసలు ఏమైపోయాయి ? ఆ తెలివితేటలు ?. ఆంధ్రుల రక్తంలోనే ఎదుగుదల ఉంటుంది ?, మరెందుకు బటన్ రెడ్డికి బానిసలుగా పడి ఉన్నారు చాలామంది ?, నిజానికి బటన్ మోహన్ రెడ్డి గారు మెజార్టీ జనాలకి నచ్చడం లేదు. ఆయన పాలన తీరు పై విసిగిపోయారు. ఆ విసుగు వ్యక్తం చేస్తే ఏమవుతుందో అని భయం. ఈ భయమే బటన్ రెడ్డి పై వ్యతిరేకతను తగ్గిస్తోంది. కానీ ఓట్లు రూపంలో కచ్చితంగా ఆ వ్యతిరేఖత కనిపిస్తోంది.

కానీ, ఇక్కడ చింతించాల్సిన అంశం ఏమిటంటే.. ?, ఎన్నికల సమయానికి అసలు జగన్ రెడ్డి పై మెజారిటీ జనానికి కోపం ఉంటుందా ?, సారా ప్యాకెట్ల పుణ్యమా అని మత్తులో చిత్తు అయిపోతుందా ?, ముఖ్యంగా పల్లెల్లో అరుగుల మీద ఉంటారు మహానుభావులు. వాళ్లలో పెద్దగా అసంతృప్తి ఉండదు. అసలు వాళ్లకు ఏం పట్టదు. వాళ్లకు తెలిసిందే వేదాంతం, వాళ్ళు నమ్మిందే సిద్దాంతం, ఇలాంటి వాళ్లు అంతా బటన్ రెడ్డిని తెగ మెచ్చుకుంటున్నారు. కారణం.. నేరుగా వారికీ బటన్ రెడ్డి బటన్లు నొక్కి డబ్బులు వెయ్యడం.

ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డబ్బులు పంచిపెడుతున్నాడు. కాబట్టి.. రాష్ట్రం నాశనం అయిపోతే మాకేమిటి ? అనుకునే జనం కూడా ఆంధ్ర సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నారు. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా ?, అందుకే.. ఓటు హక్కు అనేది కేవలం తెలివైన వాళ్ళకి మాత్రమే ఇస్తే ఆంధ్ర రాష్ట్రం మళ్లీ బతుకుతుంది. లేదంటే.. బటన్ల కింద పడి ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!