
Sankranthiki Vasthunnam sequel:
Sankranthiki Vasthunnam సినిమా అద్భుతమైన విజయంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ చేయడం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో సినీ ప్రియుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’లాంటి ఫ్రాంచైజ్‌ల విజయాల తర్వాత, ఆయన ఈ సినిమాతో మరో ఫ్రాంచైజ్‌ని మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సినిమాలో ప్రధాన పాత్రలు వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి పోషించగా, వీరి పాత్రలను మార్చకుండా వేరే కథతో సీక్వెల్ చేయవచ్చని అనిల్ వెల్లడించాడు. ‘‘ఈ కథకు కొనసాగింపు చేయడం చాలా ఈజీ. సినిమాలోని పాత్రలు బాగా వర్కవుట్ అయ్యాయి. రాజమండ్రిలో ముగిసిన క్లైమాక్స్ నుండే సీక్వెల్ మొదలుపెట్టి కొత్త సన్నివేశాలను జోడించొచ్చు,’’ అని అనిల్ చెప్పారు.
సీక్వెల్‌కి ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ను అనిల్ దాదాపుగా కన్ఫర్మ్ చేశార. సినిమా విడుదలైన 5 రోజుల పాటు థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో నిండిపోవడం, ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం సినిమాకు కలిసొచ్చాయి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌లో అనిల్‌కు ఎంత పేరు తీసుకువచ్చిందో తెలియజేస్తోంది.
ఒకే టెంప్లేట్‌తో ఇలాంటి సినిమాలు చేస్తూ అనిల్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకోవడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫ్లాప్ లేకుండా దర్శకుడిగా నిలబడ్డ అనిల్ రావిపూడి, ఈ సీక్వెల్‌తో మరో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: Akhil Akkineni పెళ్లి కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!













