HomeTelugu Trendingసంతోష్‌ శోభన్‌ 'అన్నీ మంచి శకునములే' మోషన్‌ పోస్టర్‌

సంతోష్‌ శోభన్‌ ‘అన్నీ మంచి శకునములే’ మోషన్‌ పోస్టర్‌

Anni Manchi Sakunamule Moti

టాలీవుడ్‌లో ‘పేపర్ బాయ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సంతోష్‌ శోభన్‌. ఇటీవలే వచ్చిన ‘ఏక్‌ మినీ కథ’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచుకున్నాడు సంతోష్‌ శోభన్‌. ఈ యంగ్‌ హీరోతో ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ.. మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ కథకి ‘అన్నీ మంచి శకునములే’ అనే పేరు ఫిక్స్‌ చేశారు. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నా సినిమా మోషన్‌ పోస్టర్‌లో.. ఆహ్లాదరకరమైన తేయాకు తోటల మధ్య రైలు ప్రయాణించే సుందర దృశ్యాలు కనిపిస్తాయి.

వెన్నెల కిశోర్‌, రావు రమేశ్‌, నరేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘జాతిరత్నాలు’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘ఏక్‌ మినీ కథ’ అందించిన విజయంతో మరికొన్ని కథల్నీ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు సంతోష్‌. స్వప్న సినిమా మరియు మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu