HomeTelugu Newsపాకిస్థాన్‌కు మరో షాక్

పాకిస్థాన్‌కు మరో షాక్

12 11
పుల్వామా ఉగ్రవాద దాడితో నలువైపుల నుంచి చిక్కుకుపోయి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. ప్యారిస్ లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమావేశంలో పాకిస్థాన్‌ను ప్రస్తుతం ఉన్న గ్రే లిస్ట్ లోనే కొనసాగించాలని నిర్ణయించారు. అంటే హఫీజ్ సయీద్, మసూద్ అజర్ ల నేతృత్వంలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకొని గ్రే లిస్ట్ నుంచి బయటపడాలన్న పాక్ ప్రయత్నం విఫలమైంది.

ఎఫ్ఏటీఎఫ్ నుంచి దక్కిన కొద్దిపాటి ఊరట ఎంతో కాలం కొనసాగేలా కూడా లేదు. పాకిస్థాన్ రేటింగ్ పై జూన్, అక్టోబర్ నెలల్లో మరోసారి సమీక్ష జరుపుతారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకొనేందుకు ఇచ్చిన నిర్ణీత కాలవ్యవధి దాటిపోకుండా చూసుకోవాలని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్ ను హెచ్చరించింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. నిజానికి భారత్ పాకిస్థాన్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చాలని కోరుతూ ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ అవి ఫలించలేదు.

ఇచ్చిన కాలవ్యవధిలోపుగానే లక్ష్యం పూర్తి చేయాలని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్ కు సలహా ఇచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే దేశాలకు ఈ ఎఫ్ఏటీఎఫ్ సంస్థ ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ సంస్థ ఇచ్చే రేటింగ్ ఆధారంగా వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సహా పలు ఆర్థిక సంస్థలు సాయం అందజేస్తారు. ఈ సంస్థలు రేటింగ్ ప్రకారం ఏ దేశానికైనా రుణాలు ఇస్తాయి. పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ రేటింగ్ బ్లాక్ లిస్ట్ చేయించేందుకు భారత్ ఎంతో కాలంగా ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం పలు దేశాలతో చర్చలు జరుపుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu