నాగార్జున సినిమాలో యంగ్ బ్యూటీ!

ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో మలయాళ హీరోయిన్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకు హిట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అందుకేనేమో మన హీరోలు కూడా తమ సినిమాల్లో హీరోయిన్స్ గా మలయాళం అమ్మాయిలనే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్య తెలుగులో బాగా ఫేమస్ అయిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. రామ్ చరణ్ సినిమాలో కూడా అమ్మడుకి అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్ అయింది.

అయితే ఇప్పుడు నాగార్జున సినిమాలో అనుపమను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, నిఖిల్ హీరోలుగా చందు మొండేటి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనుపమను ఎన్నుకున్నారు. గతంలో చందు రూపొందించిన ‘ప్రేమమ్’ సినిమాలో అనుపమ కనిపించింది. తన పనితీరు
నచ్చడంతోనే చందు మరోసారి తన సినిమాలో హీరోయిన్ గా అనుపమను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.