HomeTelugu Trendingప్రభాస్‌ కోసం సినిమాలు కూడా మానేస్తా : అనుష్క

ప్రభాస్‌ కోసం సినిమాలు కూడా మానేస్తా : అనుష్క

7 22
స్టార్‌ హీరోయిన్‌ అనుష్క తాజాగా ఓ గేమ్‌లో షోలో పాల్గొన్నారు. ఈ షోలో ‘ఈ రెండింటిలో ఏదో ఒక పని చేయడం మానేయమంటే ఏం మానేస్తారు. ప్రభాస్‌తో ఫ్రెండ్‌షిప్ లేక సినిమాల్లో యాక్టింగ్‌’ అని ప్రశ్నించగా, మరో ఆలోచన లేకుండా సినిమాల్లో నటించడం మానేస్తానని సమాధానం ఇచ్చారు. తన పనికోసం స్నేహాన్ని వదులుకోలేనని అంది.

ఫేవరెట్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ అని, తన కెరీర్‌ ప్రారంభమై 15ఏళ్లు అయిన సందర్భంగా ‘సూపర్‌’ మూవీ షూటింగ్‌లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు అనుష్క. ”సూపర్‌’ నా తొలి చిత్రమైతే అందులోని ‘అక్కడబక్కడ భంభేబో’ నా తొలి పాట. ‘సూపర్‌’ నాకు చాలా స్పెషల్‌. ఈ పాటకు రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు డ్యాన్స్‌ ఎలా చేయాలో తెలిసేది కాదు. ‘నేను చేయలేను’ అని ఏడ్చాను. ‘పర్వాలేదు పది రోజులైనా టైమ్‌ తీసుకుని రిహార్సల్స్‌ చేయండి. వచ్చినప్పుడే చేద్దాం’ అని ఆ యూనిట్‌ మొత్తం ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు అలవాటైంది కానీ, అప్పటికి నేను గ్రేట్‌ డ్యాన్సర్‌ను కాదు. నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జునగారు, పూరి జగన్నాథ్‌గారి ధన్యవాదాలు. 15ఏళ్ల కెరీర్‌ పూర్తయింది. ఇలాంటి సమయంలో కోడి రామకృష్ణగారు లేకపోవడం బాధాకరం. ఆయన ఎక్కడ ఉన్నా మాతోనే ఉంటారు” అంటూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయింది స్వీటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!