అనుష్క బరువు తగ్గకపోవడానికి కారణమదే!

సైజ్ జీరో సినిమా కోసం బాగా బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత ఆ బరువుని తగ్గించుకోలేకపోయింది. కృత్రిమ పద్దతుల ద్వారా బరువు తగ్గమని సలహా ఇచ్చిన ఆమె మాత్రం దానికి అంగీకరించలేదు. యోగా ద్వారానే తన శరీరాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకోవాలనుకుంది. కానీ అదీ కుదరలేదు. నిజానికి సింగం3 సినిమా చేసేప్పుడు అనుష్కకు ఓ గాయం అయిందట. దీంతో కొంతకాలం పాటు బెస్ట్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ సమయంలో ఆమె వ్యాయామాలు, డైట్ కంట్రోల్ చేయడం కుదరదు. దాంతో ఆమె అనుకున్నట్లుగా నాజూకుగా మారలేకపోయింది.

రీసెంట్ గా విడుదలయిన ఓం నమో వెంకటేశాయ, సింగం3 సినిమాలు చూస్తే ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది. బాహుబలి2 సినిమాలో కూడా అనుష్కను డిజిటల్ టెక్నాలజీ ద్వారా సన్నంగా చూపించబోతున్నారు. అయితే ఆమె నటిస్తోన్న ‘భాగమతి’ సినిమాలో మాత్రం ఆమె సన్నంగా కనిపించబోతుందని తెలుస్తోంది.