పవన్ మాటలకు వర్మ కౌంటర్స్!

పవన్ కల్యాణ్, రామ్ గోపాల్ వర్మ ల మధ్య రోజురోజుకి మాటల యుద్ధం పెరిగిపోతుంది. రీసెంట్ గా పవన్ కల్యాణ్, రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ”ఒకసారి పైకి ఎత్తేసి.. మరోసారి కిందకి దించేసే వ్యక్తుల గురించి నేనేం మాట్లాడాలి..? ఈ మధ్యనే వర్మ కూతురుకి
పెళ్ళైంది. కానీ పోర్న్ సినిమాలు కలెక్ట్ చేస్తూ ఉంటానని చెప్పే వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా..? అంటూ ఘాటైన విమర్శలు చేశారు. మరి పవన్ ఇన్ని మాటలు అనేశాక వర్మ ఊరుకుంటాడా..? వెంటనే తన విమర్శలకు పదును పెట్టాడు.

”ఒక అభిమానిగా పి‌కే మీద ఎక్స్పెక్టేషన్స్ తో మాట్లాడాను గానీ తను చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ లాంటి పెర్శనల్ విషయాలు నేనెప్పుడు మాట్లాడలేదు. నా జీవితం నా లైఫ్ స్టయిల్ నేను ఆలోచించే విధానం దాక్కోకుండా దాచకుండా నా పుస్తకం నా ఇష్టం లో మొత్తం విప్పి విప్పి రాశాను. వాళ్ళింట్లో వాళ్ళ గురించి మాట్లాడారని యండమూరిని తిట్టారు. మరి వాళ్ళు వేరే ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడొచ్చా..? ఇదేనా వికాసమని ప్రశ్నించారు. అలానే ”నేను తన మీద ఇష్టంతో నిజయీతీగా మాట్లాడాను కానీ విమర్శించడానికి కాదని తను తట్టుకోలేకపోవడం నా దురదృష్టం” అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పట్లో ఈ గొడవ సర్ధుమణిగేలా లేదు!