ప్రభాస్ కు అనుష్క స్పెషల్ గిఫ్ట్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈరోజు ఘనంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ప్రభాస్ కు బర్త్ డే విసెష్ చెబుతున్నారు. అయితే ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం అతడి ఓ స్పెషల్ గిఫ్ట్ ను పుట్టినరోజు కానుకగా ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సర్ప్రైజ్ తో ప్రభాస్ ఆశ్చర్యానికి గురయ్యాడట. డిజైనర్ చేతి గడియారాలను ఇష్టపడే ప్రభాస్ కు అనుష్క స్పెషల్ గా ఓ వాచీను డిజైన్ చేయించిందట.

ఆ వాచీ చూసిన ప్రభాస్ ఆనందాశ్చర్యాలకు గురయినట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి వరుస సినిమాలు చేస్తుండడం, సినిమాను సంబందించిన పలు వేడుకల్లో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుబోతున్నారనే వార్తలు వినిపించాయి.

నిశ్చితార్ధం కూడా చేసుకోబోతున్నారని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం ఎలాంటి నిజం లేదని, తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని బహిరంగంగా చెప్పుకొచ్చారు.