Homeతెలుగు Newsరాహుల్‌తో చంద్రబాబు భేటీ

రాహుల్‌తో చంద్రబాబు భేటీ

11 4కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు. బీజేపీ వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబర్‌ 9న ఢిల్లీ లో సుమారు 28 రాజకీయ పార్టీలతో జరిగిన భేటీకి కొనసాగింపుగా చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటన చేపట్టారు. రాహుల్‌తో భేటీ అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నెల 19న కోల్‌కతాలో బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే భారీ ర్యాలీలపై నేతలతో చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఎజెండాను పూర్తిస్థాయిలో ఖరారు చేసే లక్ష్యంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్టు సమాచారం. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి? జనవరి 19 తర్వాత ఎక్కడ ఎలాంటి సమావేశాలు పెట్టాలి? ఎవరు ఎక్కడ హాజరు కావాలి? ఆయా చోట్ల ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలేమిటి? తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జాతీయ నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు టీడీసీ ఎంపీలతో సమావేశం కానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu