బహుబలికి ఏపీలో ఆరు తెలంగాణలో ఐదు!

ఆంధ్రప్రదేశ్ లో బాహుబలి సినిమా రోజుకి ఆరు ఆటలను ప్రదర్శించేలా అక్కడి ప్రభుత్వం నుండి అనుమతిని కోరారు చిత్రనిర్మాతలు. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే తెలంగాణలో మాత్రం ఐదు ఆటల కోసమే అనుమతిని కొరిన్ద్. నాలుగు షోలతో సాధించే దానికంటే, ఐదు, ఆరు షోలతో మరిన్ని కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారు. నిజానికి ఈ అదనపు షోల డిమాండ్ ఇప్పటిది కాదు. ఎప్పటినుండో ఐదో ఆట చిన్న సినిమా కోసం కేటాయించాలని చిన్న సినిమాల నిర్మాతలు కోరుతున్నారు.

అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ బాహుబలి విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించింది. మరి దీని వెనుక ఉన్న ప్రముఖ వ్యక్తులకు ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు అటువంటివి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తంగా అత్యధిక థియేటర్లలో సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. వెయ్యి కోట్ల వసూల్లే లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్.