Homeతెలుగు Newsచంద్రబాబు విదేశీ పర్యటనలు అందుకోసమే: లోకేష్

చంద్రబాబు విదేశీ పర్యటనలు అందుకోసమే: లోకేష్

6 4

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడిని నిలదీయడం తప్పా.. హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం చెయ్యడం నేరమా అని మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుని బీజేపీ నాయకులు అసభ్య పదజాలంతో తిడుతుంటే సుదీర్ఘ అనుభవం ఉండి, దేశానికి పెద్దన్నగా ఉండాల్సిన ప్రధాని నరేంద్ర మోడి నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎదురు తిరిగితే అణచివేస్తా అనే ప్రధాని మోడి ధోరణి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు. ఇటీవల ప్రధాని మోడి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ నేతలు సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించడంపై మంత్రి లోకేశ్‌ ఈ విధంగా స్పందించారు.

ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనకు ఇటీవల కేంద్రం విదేశాంగ శాఖ కొన్ని ఆంక్షలు విధించడంపైనా మంత్రి లోకేశ్ స్పందించారు. నాలుగు రోజులే పర్యటించాలని, ముఖ్యమంత్రితో కలిపి ఐదుగురే వెళ్లాలని తొలుత సూచించింది. దేశం కోసం ప్రధాని విదేశీ పర్యటనలు ఎలా ముఖ్యమో.. రాష్ట్ర భవిష్యత్తుకోసం చంద్రబాబు విదేశీ పర్యటనలూ అంతే ముఖ్యమని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై ఆంక్షలు విధించిన కేంద్రం.. ప్రధాని విదేశీ పర్యటనలపై కూడా షరతులేమైనా పెట్టిందా?అని నిలదీశారు. చంద్రబాబు దావోస్‌ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి సహా మొత్తం 17 మంది ప్రతినిధుల బృందం దావోస్‌ వెళ్లేందుకు శుక్రవారం అనుమతినిచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu