HomeTelugu Big Storiesరివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు

రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు

నటీనటులు: నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యా హోప్, ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజీ, రవివర్మ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: నవీన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
నారా రోహిత్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. మన దేశంలోని తొంబైలలో పరిస్థితులను ఆవిష్కరించే దిశగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి ‘ప్రతినిధి’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. మరి ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ తమ లక్ ను రిపీట్ చేసిందో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
రైల్వే రాజు(శ్రీవిష్ణు)కి పెద్ద క్రికెటర్ కావాలనేది కల. మరికొన్ని రోజుల్లో నేషనల్స్ కి ఆడడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. స్నేహితులు, ఓ గర్ల్ ఫ్రెండ్, క్రికెట్ ఇవే రైల్వే రాజు జీవితం. ఇంతియాజ్ అలీ(నారా రోహిత్) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. చిన్నతనంలో తన తల్లితండ్రులను నక్సలైట్స్
చంపడం చూసిన ఇంతియాజ్ కు అప్పటినుండే నక్సలైట్స్ పై పగ ఏర్పడుతుంది. తను పోలీస్ ఆఫీసర్ అయిన తరువాత నక్సలైట్లను ఎన్ కౌంటర్ చేయడానికి కూడా వెనుకాడడు. రైల్వే రాజు అక్క అహల్య ఓ నక్సలైట్. ఆమెను వెతికి పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంతియాజ్ రైల్వేరాజుని టార్గెట్ చేస్తాడు. తన అక్క జాడ చెప్పమని వేధిస్తారు. కానీ రాజు పోలీసులకు కోపరేట్ చేయడు.దీంతో అతడిపై ఓ దందా కేసు బుక్ చేసి నేషనల్స్ ఆడనివ్వకుండా చేస్తారు పోలీసులు. దీంతో రగిలిపోయిన రాజు ఏ విధంగా మారాడు..? తను క్రికెటర్ అవ్వగలిగాడా..? అసలు రైల్వేరాజుని
టార్గెట్ చేయడంలో ఇంతియాజ్ ఆలోచన ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
దర్శకుడు మన దేశంలో తొంభైలలో జరిగిన కొన్ని యధార్థ సఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించాడు. తను అనుకున్న కథను కొత్తగా ప్రెజంట్ చేయాలనుకున్నాడు. స్క్రీన్ ప్లే రెగ్యులర్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంది. అక్కడక్కడా రామ్ గోపాల్ వర్మను
అనుకరించినట్లు అనిపిస్తుంది. డైరెక్టర్ అనుకున్న కథను ఆడియన్స్ కు అర్ధమయ్యే విధంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కథను పరిశీలిస్తే గనుక ఆనాటి పరిస్థితులపై అతడు చాలా రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.

కానీ ఏం ప్రయోజనం.. టెక్నికల్ టీం ఏ మాత్రం అతడికి సపోర్ట్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఎంత ఫాస్ట్ గా సాగుతుందో.. సెకండ్ హాఫ్ అంత స్లో గా నడుస్తుంది. సాయి కార్తీక్ మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకోదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బావుండేది. సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద మైనస్. అప్పటి పరిస్థితులకు తగ్గట్లు తన ఫోటోగ్రఫీతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయలేకపోయాడు. ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఖచ్చితంగా సినిమా మీద పడ్డాయి. నిర్మాణ విలువలు అసలు కథకు తగినట్లుగా లేవు.

సినిమాలో లేడీ నక్సలైట్ పాత్ర ఒకప్పటి నక్సలైట్ లలితక్కను గుర్తు చేస్తాయి. సెకండ్ హాఫ్ లో చూపించే స్టాంపుల కుంభకోణం సినిమాకు ఒక హైలైట్ సీన్ గా నిలిచింది. కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ ను ఆలోచింపచేసేలా.. చేయడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం నారా రోహిత్, శ్రీవిష్ణు ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ గా రోహిత్ చక్కటి నటనను కనబరిచాడు. ఈ సినిమాతో శ్రీవిష్ణుకి మంచి పేరు రావడం ఖాయం. ఫస్ట్ హాఫ్ లో క్రికెటర్ గా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసిన శ్రీవిష్ణు రౌడీగా మారిన తరువాత అతడి నటనలో వేరియేషన్ చూపించాడు. శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను ల కామెడీ పెద్దగా పండలేదు. బ్రహ్మాజీ పాత్రకు సినిమాలో ప్రాముఖ్యత ఉంటుంది. హీరోయిన్ తాన్య హోప్ కు సినిమాలో ఎటువంటి ప్రాధాన్యత లేదు.

1990 లలో మనదేశంలో జరిగిన కొన్ని అమానుష సంఘటనల డాక్యూమెంటరీ ఈ సినిమా. రాజకీయనాయకులు సైతం కొన్ని అసాంఘిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం వంటి సెన్సిటివ్ విషయాలతో కథను డీల్ చేశారు. మొత్తానికి టెక్నికల్ ఈ సినిమా నిరాశ పరిచినా.. ఆర్టిస్ట్స్ నటన పరంగా ఆకట్టుకుంది.
రేటింగ్: 2.5/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu