అరవింద స్వామి ‘నరకాసురుడు’ ఫస్ట్‌లుక్‌


స్టార్ హీరో అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నరకాసురుడు’. కార్తిక్‌ నరేన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. సందీప్‌ కిషన్‌, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో అరవింద్‌ స్వామి బాధగా, శ్రియ కోపంగా చూస్తున్నట్లుగా కనిపించారు. ‘నేలకొరిగిన ఓ రాక్షసుడి కథ’ అన్న క్యాప్షన్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గతేడాది మేలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడతూ వస్తోంది. ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. తెలుగు, తమిళంలో ఒకేసారి వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.