HomeTelugu Big Storiesవినోదమే కాదు సినిమా ఆలోచననూ రేకెత్తించాలి: బాలకృష్ణ

వినోదమే కాదు సినిమా ఆలోచననూ రేకెత్తించాలి: బాలకృష్ణ

 

3 18

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ “తెలుగు దేశం పార్టీకి తొలి శ్రామికుడు మా అన్నయ్య నందమూరి హరికృష్ణ. ఆయన మనసు వెన్న.. మనిషి మొరటు. అది ఆయన లక్షణం. అదే గొప్ప అలంకారం. నాన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. చైతన్య రథానికి సారథిగా పనిచేశారు. రవాణాశాఖ మంత్రిగా చాలా సేవలు చేశారు. ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు “ఎన్టీఆర్‌” బయోపిక్‌లో బిజీగా ఉండడం వల్ల “అరవింద సమేత” చూడలేకపోయా. “పాలిచ్చి పెంచిన తల్లికి పరిపాలించడం ఓ లెక్కా” అనే డైలాగ్‌ వింటే.. “లెజెండ్‌”లో స్త్రీ గొప్పదనం గురించి చెప్పిన డైలాగ్‌ గుర్తొచ్చింది. మంచి ఇతివృత్తం తీసుకున్నారు త్రివిక్రమ్‌. పదునైన సంభాషణలు రాశారు. చిత్రసీమ గర్వించదగిన దర్శకుడు అన్నారు.

“వినోదంతో పాటు ఆలోచనను రేకెత్తించేలాంటి మంచి సినిమా అరవింద సమేత వీర రాఘవ” అన్నారు. నేనూ, తారక్‌ చేసే సినిమాలు మిగిలిన వాళ్లు చేయడం అసాధ్యం. ఎందుకంటే మేం ఎక్కువగా లార్జర్‌ దన్‌ లైఫ్‌ పాత్రలు చేస్తుంటాం. మా సినిమాల్లో నవరసాలూ ఉండాలని కోరుకుంటారు అభిమానులు. మా పాత్రలూ అలానే ఉంటాయి. అందరూ కష్టపడితేనే మంచి సినిమా వస్తుంది. అలా ఈ సినిమాకి అంతా కష్టపడ్డారని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ “ఓ మంచి ప్రయత్నానికి నాంది పలికారు త్రివిక్రమ్‌. ఈ విజయదశమికి నల్లమబ్బు కమ్మిన విషాద ఛాయల్లో ఉన్న మా కుటుంబానికి ఓ కొత్త వెలుగు తీసుకొచ్చారు. జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం అందించారు. నాన్నగారు లేకపోయినా… మా తండ్రి హోదాలో మా బాబాయ్‌ ఇక్కడికి వచ్చారు” అన్నారు.

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ “రాయలసీమ యాసలో తమ్ముడు డైలాగ్స్‌ చెబుతుంటే అక్కడే పుట్టి పెరిగాడేమో అనిపించింది. త్రివిక్రమ్‌ వినోదాత్మక చిత్రాలు తీశారు. తొలిసారి పూర్తిస్థాయి ఎమోషనల్‌ చిత్రం తెరకెక్కించారు. క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. జగపతిబాబు పాత్రలో ఆయన్ని కాకుండా మరొకరిని ఊహించలేం. ఆ పాత్ర అంత బాగుండడంతోనే తారక్‌ పాత్ర మరింత బాగా వచ్చింది. ఇళయరాజా స్థాయిలో తమన్‌ రీ రికార్డింగ్‌ అందించాడని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!