ఆర్య, సాయేషా ప్రీ వెడ్డింగ్‌ .. వీడియో వైరల్‌

తమిళ స్టార్‌ ఆర్య, నటి సాయేషా సైగల్‌ వివాహ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ విషయాన్ని వీరు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో పెద్దల సమక్షంలో ఆదివారం (మార్చి 10) వీరి వివాహ వేడుక జరగబోతోందని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు సంజయ్‌ దత్‌, ఆదిత్యా పంచోలీ, ఖుషి కపూర్‌, పలువురు కోలీవుడ్‌ నటులు సందడి చేశారు.

సాయేషా గులాబి రంగు లెహెంగాలో మెరిశారు. తన సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. కరీనా కపూర్‌, షాహిద్‌ కపూర్ కలిసి నటించిన ‘జబ్‌ వి మెట్‌’ సినిమాలోని ‘మౌఝా హీ మౌఝా’ పాటకు ఆమె స్టెప్టులేశారు. గాయని ప్రీతీ భల్లా బాలీవుడ్‌ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.