హారర్, కామెడీ నేపధ్యంలో ‘అవంతిక’!

భీమవారం టాకీస్ పతాకంఫై ప్రొడక్షన్ నెం 90గా పూర్ణ. గీతాంజలి హీరోయిన్లుగా కే.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బళ్ళా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ ‘అవంతిక’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సంధర్భంగా.. 
 
రోశయ్య మాట్లాడుతూ.. ”ఈ సినిమాకు అందరూ యంగ్ టెక్నీషియన్స్ పని చేశారు. రామసత్యనారాయణ 90 సినిమాలు పూర్తి చేసి వంద సినిమాలు  మైలురాయిని అందుకునే దిశగా పరుగులు తీస్తున్నారు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు. 
 
తుమ్మలపల్లి రామసత్యనారాయన మాట్లాడుతూ.. ”భీమవరం ప్రాంతానికి పేరు రావాలని బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నాను. ఓ మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా చేశాం. దర్శకుడు నా బ్యానర్ లో డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి. కామెడీ, హారర్ నేపధ్యంలో సాగే కథ. 42 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేశారు. మంచి సంగీతం కుదిరింది” అన్నారు. 
 
డైరెక్టర్ శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ.. ”నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు, సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ కు థాంక్స్. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అన్నారు.