HomeTelugu Big Storiesఆసక్తికరంగా 'పిండం' టీజర్‌

ఆసక్తికరంగా ‘పిండం’ టీజర్‌

Pindam Teaser

స్నేహితుడు ఫేం శ్రీరామ్ లాంగ్‌ గ్యాప్‌ తరువాత హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘పిండం’. కుశీ రవి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఇది అన్ని కుక్కల్లా లేదు. ఇదేదో వేరే జంతువులా ఉంది. దీనిని వెంటనే పూడ్చి పెట్టండి. లేదంటే ఈ ఊరికే ప్రమాదం అంటూ న‌టి ఈశ్వరీ రావు చెప్పే సంభాషణతో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. టీజ‌ర్ గ‌మ‌నిస్తే.. ఓ మారుమూల ప‌ల్లెటురిలో ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ.. దీని చుట్టే కథ స్టోరీ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఓ పాప బల్లపై పడుకొని ఉండటం, చుట్టూ నిల్చొని ఉన్న వ్యక్తులు ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నట్లు కనిపించడం టీజ‌ర్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇక ఈ సినిమాలో ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో ఈశ్వరి రావు న‌టిస్తుండ‌గా.. తన కుటుంబాన్ని ఆత్మ నుంచి రక్షించుకునే పాత్రలో శ్రీరామ్ కనిపించ‌నున్నాడు. ఇక 1930 నుంచి 1990 వ‌ర‌కు మూడు టైమ్‌లైన్‌లలో ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.

కళాహి మీడియా పతాకం పై యశ్వంత్‌ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu