చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో తెలుగు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అవికాగోర్. ఆ తరువాత ఉయ్యాల జంపాలా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నావాడా వంటి నటించింది. ఈమె న్యూలుక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆమె ఫొటోను అవికాగోర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
‘గతేడాది ఓ రాత్రి నాకు ఇంకా గుర్తుంది. నన్ను నేను అద్దంలో చూసుకుని డీలా అయిపోయా. పెద్ద చేతులు, కాళ్లు, బెల్లీ ఫ్యాట్ తో కనిపించిన నా లుక్ కష్టంగా అనిపించింది. బాగా లావు పెరిగాను. ఒకవేళ థైరాయిడ్, ఇతర సమస్యల వల్ల ఇలా మారితే.. నా నియంత్రణలో ఉండకుండా జరుగుతుంది కాబట్టి ఏం కాదు. కానీ నా విషయంలో అలా కాదు. నేను ప్రతీది తింటాను. వర్కవుట్స్ అస్సలు చేయను. నా శరీరంపై అంతగా శ్రద్దపెట్టలేదు. దీని ఫలితంగా నాకెంతో ఇష్టమైన డ్యాన్స్ ను ఎంజాయ్ చేయలేకపోయా. నేనిపుడు ఎలా కనిపించాలని కనీసం ఆలోచించలేదు. నన్ను నేను జడ్జి చేసుకోలేనంత బిజీ అయిపోయానని బాధపడ్డా. నన్ను చెడుగా చూసేందుకు బయటి వారికి అవకాశమివ్వకూడదనుకున్నానని చెప్పింది అవికా .
అప్పటి నుంచి అవసరమైన విషయాలపై నా ఫోకస్ పెట్టా. డ్యాన్స్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, వర్కవుట్స్ చేయడం, అవసరం లేని అలవాట్టు వదిలిపెట్టడం వంటి చేశా. నాకు చాలా మంది గైడ్‌గా ఉన్నారు. పెద్ద స్టోరీని చిన్నగా చెప్పా. ఇవాళ ఉదయాన్నే నేను అద్దంలో చూసుకున్నా. మనస్పూర్తిగా నవ్వా. నాతో నేను చెప్పకున్నా..నేను అందంగా ఉన్నానని’ అంటూ..బొద్దుగా ఉన్న తను స్లిమ్ గా మారడం వెనుకున్న కష్టాన్ని చెప్పుకొచ్చింది.