మరోసారి హారర్ సినిమాలో తాప్సీ!

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్ గా తాప్సీకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. క్రమక్రమంగా అమ్మడుకి అవకాశాలు తగ్గిపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో బాలీవుడ్ లో ఎలా అయినా.. అవకాశాలు
సంపాదించాలని తన మకాంను ముంబైకు షిఫ్ట్ చేసింది.

అనూహ్యంగా అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. ఈ నేపధ్యంలో తాప్సీ ఇక తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆమె ఓ తెలుగు సినిమాలో నటించబోతోందని టాక్. అది కూడా హారర్ సినిమాలో.. 

గతంలో తాప్సీ, లారెన్స్ రూపొందించిన ‘గంగ’ అనే హారర్ సినిమాలో కనిపించింది. ఇప్పుడు మహి రాఘవ్ అనే దర్శకుడు చెప్పిన హారర్ కామెడీ సినిమాకు అమ్మడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్ లో తాప్సీ కనిపించనుందని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!