క్రిష్ పై బాలయ్యకు కోపం ఎందుకు..?

బాలయ్య కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో బాలయ్య మరో మెట్టు ఎదిగారనే చెప్పాలి. మరి అలాంటి సినిమా ఇచ్చిన క్రిష్ పై బాలయ్య ఎందుకు కోపంగా ఉన్నాడో.. ఆ మేటర్ ఏంటో చూద్దాం.. సంక్రాంతికి శాతకర్ణితో
పాటు మరో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మూడు సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. మిగిలిన రెండు సినిమాలు కలెక్షన్స్ వివరాలు అనౌన్స్ చేసినప్పటికీ శాతకర్ణి మాత్రం వసూళ్ల వివరాలను వెల్లడించలేదు.

దీంతో బాలయ్య వివరాలను చెప్పమని నిర్మాతలపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయినా.. కూడా బాలయ్యకు సరైన సమాధానం చెప్పకపోవడంతో కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఐటీ శాఖ మాత్రం శాతకర్ణిని వదలలేదు. నిన్న ఈ చిత్ర నిర్మాతలు, పంపిణీదారుయాలపై సోదాలు నిర్వహించింది. దీంతో ఇక క్రిష్ కలెక్షన్స్ గురించి చెప్పేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ సినిమా సక్సెస్ మీట్ ఇంకా జరగలేదు కాబట్టి సక్సెస్ మీట్ ను నిర్వహించి కలెక్షన్స్ వివరాలు అధికారికంగా చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.