HomeTelugu Trending'కేజీఎఫ్‌-2' నుండి ఇనాయత్ ఖలీ ఫస్ట్‌లుక్‌

‘కేజీఎఫ్‌-2’ నుండి ఇనాయత్ ఖలీ ఫస్ట్‌లుక్‌

Balakrishna birthday specia
కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ కాస్తా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ లతో పాటు అదిరిపోయే టీజర్ తో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అలాగే కేజీఎఫ్ సీక్వెల్ టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సెట్ చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఊరమాస్ కేజీఎఫ్ సిరీస్ తో డైరెక్టర్ కూడా ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా ఈ ఏడాది జులై 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశంలో థియేటర్స్ సినిమా షూటింగ్స్ ఆగిపోయిన విషయం విదితమే. ఇప్పట్లో విడుదలైయ్యే అవకాశలు కనిపించడం లేదు.

అయితే ఎప్పుడు రిలీజ్ అయినా సినిమాకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ సినిమాలో నటించే సెలబ్రిటిస్ పుట్టినరోజు సందర్బంగా ఒక్కో క్యారెక్టర్ విడుదల చేస్తున్నారు మూవీ టీమ్. తాజాగా ఈ సినిమాలో నటించిన పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇనాయత్ ఖలీకి సంబంధించిన కేజీఎఫ్ టైమ్స్ పత్రికలో ఆ క్యారెక్టర్ పోషించిన బాలకృష్ణగారి పిక్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ అనేది చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్.. అంతేగాక ఇనాయత్ ఖలీల్ ప్రస్తుతం ఇండియాలో ఏదొక చోట పుట్టినరోజు జరుగుకుంటున్నట్లు కాప్షన్ జోడించారు. అయితే ఈ బాలకృష్ణ ఎవరో కాదు. టాలీవుడ్ యాక్టర్ ఆదర్ష్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!