బాలయ్య పోటీ ఎన్టీఆర్ తో మాత్రమేనా?

నటసింహం బాలయ్య ఈ మధ్య అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఒక సినిమా పూర్తికాకూండానే ఇంకో సినిమా లైన్ లో పెడుతూ కుర్ర హీరోలు కూడా అందుకోలేని స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. పైసా వసూల్ రిలీజ్ అయ్యి మూడునెలలు కూడా కాలేదు అప్పుడే సంక్రాంతికి సినిమా రెడీ చేసేసాడు. ఆల్రెడీ జనవరి 12 న బాలయ్య 102 వ సినిమా జై సింహా రిలీజ్ అవుతుందని అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసారు సినిమా మేకర్స్. అయితే జై సింహ తరువాత ఎన్టీఆర్ బయో పిక్ చేస్తున్న బాలయ్య ఆ సినిమాలో హరికృష్ణ పాత్ర పోషించేందుకు కళ్యాణ్ రామ్ ని ఎంపిక చేసారు. గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్,చాల సఖ్యతగా ఉంటున్నారు. మొన్నే ఇద్దరూ కలిసి జైలవకుశ అనే సూపర్ హిట్ సినిమా కూడా చేసారు.అయితే ఎన్టీఆర్ అంటేనే అస్సలు గిట్టనట్టు ఉంటున్న బాలయ్య కళ్యాణ్ కి ఈ పాత్రని ఎందుకు ఎంపిక చేశాడా అని అంతా చర్చించుకుంటున్నారు.

ఇది కేవలం ఈ సినిమా కోసమేనా లేక ఇలా కళ్యాణ్ రామ్ ని మంచి చేసుకుని అతని ద్వారా ఎన్టీఆర్ ని అప్రోచ్ అయ్యి వచ్చే ఎన్నికలలో ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించటానికా అనే డౌట్ కూడా వ్యక్తమవుతుంది. గౌతమి పుత్ర శాతకర్ణి టైం లో కూడా కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ ట్వీట్స్ కి ఏ మాత్రం రెస్పాండ్ కానీ బాలయ్య నారా రోహిత్ విషయంలో మాత్రం ఇంట్రెస్ట్ గా స్పందించేవాడు. ఇప్పడు మాత్రం సీన్ మారుతున్నట్టు ఉంది.

ఈ పరిస్థితి చూస్తుంటే బాలయ్య కి ఎన్టీఆర్ తో మాత్రమే కొద్దిగా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ మధ్యే నేనే రాజు నేనే మంత్రి సినిమాతో విజయాన్ని అందుకున్న తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చంద్రబాబు పాత్రని జగపతిబాబు పోషిస్తాడని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ బయో పిక్ కేవలం ఒక సినిమాగానే కాక చాలా రకాలుగా చాలా విషయాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది.