నేను ఎక్కువగా కలిసేది చిరంజీవినే!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రేక్షకుల నుండి అశేష స్పందన లభిస్తోంది. ఈ సంధర్భంగా.. బాలకృష్ణ సినిమా గురించి కొన్ని వివరాలు తెలిపారు.

సినిమాను ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులను నా ధన్యవాదాలు. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల విజయంగా చూస్తాను.

ఈ పాత్రలో నేను తప్ప మరొకరు సెట్ కాలేరని అందరు అంటున్నారు. అది ప్రేక్షకులిచ్చే తిరుగులేని అభినందనగా చూస్తాను. నాన్నగారికి ఉన్న ఇమేజ్ వల్ల అందరూ అలా అనుకొని ఉంటారనుకుంటాను.

శాతకర్ణి గురించి చరిత్రలోనూ తక్కువ విషయాలే ఉన్నాయి. దీంతో మేము తెలిసిన సంఘటనలతోనే కథ తయారుచేయాలి. ఈ క్రమంలోనే దర్శకుడు క్రిష్, నేను, టీమ్ అంతా చాలా చర్చలు చేసి ఒక పక్కా స్క్రిప్ట్‌ను ముందే తయారుచేయగలిగాం.

ఇండస్ట్రీలో నన్నడిగితే ఆరోగ్యకర పోటీ ఉండడంలో తప్పు లేదు. ఈసారి చిరంజీవి గారి సినిమా, నా సినిమా ఒకేసారి వచ్చాయి. ఇండస్ట్రీలో నేను ఎవరితోనైనా ఎక్కువగా కలుస్తానంటే అది చిరంజీవితోనే.. మా ఇద్దరి సినిమాలూ బాగా ఆడడం సంతోషంగా ఉంది.

మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఈ ఏడాది చివరికల్లా మొదలవుతుంది. శాతకర్ణి సినిమాకు మోక్షజ్ఞ,క్రిష్‌ డైరెక్షన్ టీమ్‌లో పనిచేశాడు. ప్రస్తుతం హీరో అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. నేను, మోక్షజ్ఞ కలిసి ఆదిత్య 999 అనే సినిమాలో మాత్రం కలిసి నటిస్తాం. కథ కూడా రెడీ అవుతోంది.