పూరి-బాలయ్యల ‘పైసా వసూల్’!

నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల  సెన్సషనల్ కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘పైసా వసూల్’ అనే టైటిల్  ఖరారు చేసారు. జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు.  ఈ సంధర్భంగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సంధర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. ”పైసా వసూల్ అనే టైటిల్ ఈ కథ కు యాప్ట్. కచ్చితంగా బాలకృష్ణ గారి ఫాన్స్, ఆడియన్స్ ఫుల్ ఖుష్  అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. బాలకృష్ణ గారితో పని చేస్తున్నందుకు హ్యాపీ గా వుంది. ఈ సినిమాలో ఆయన స్టైలిష్ గా కనిపిస్తారు. ఆయన డైలాగ్స్, యాక్షన్  ఎపిసోడ్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు సీరియస్ గా ఉండే రోల్స్ చేస్తున్నారు.  ఇందులో మాత్రం ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నారు. నిజం గా అభిమానులకి పండుగే ఈ సినిమా. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్నియాక్షన్  ఎపిసోడ్స్ లో ఫారిన్ సాంకేతిక నిపుణులు  మరియు ఫైట్ మాస్టర్స్ పని చేశారు” అని తెలిపారు.
నిర్మాత వి.  ఆనంద్ ప్రసాద్  మాట్లాడుతూ.. ”మే 12  నుంచి పోర్చుగల్ లోని లిస్బన్ , పోర్టో  సిటీలలో ఇంతవరకు ఎవరు చెయ్యని లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాము. ఈ నెల 16  వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భం గా శనివారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల  నుండి ఫేస్ బుక్  లో లైవ్ ఏర్పాటు చేసాం . బాలకృష్ణ గారు మరియు పూరి జగన్నాధ్ గారు ఈ లైవ్ లో పాల్గొని అభిమానులని ఆనందపరుస్తారు. బాలకృష్ణ గారు పాల్గొనే ఫస్ట్ ఫేస్ బుక్  లైవ్ ఇదే. బాలకృష్ణ గారి 101వ చిత్రం గా రూపొందుతున్న ఈ చిత్రం లో శ్రేయ, ముస్కాన్, కైరా దత్తు  హీరోయిన్లు గా నటిస్తున్నారు” అని చెప్పారు.