HomeTelugu Trendingకన్నడ సినిమాలో బాలయ్య..?

కన్నడ సినిమాలో బాలయ్య..?

1 16నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో స్టార్‌ హీరో. లేటు వయసులో కూడా బాలకృష్ణ సింహ, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడుతో తన స్టామినాను నిరూపించుకున్నాడు. వయసు పెరిగినా.. తనలో ఉన్న నటుడు ఇంకా యవ్వనంలోనే ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు బాలయ్య చూపులు ఇతర భాషా చిత్రాలపై పడింది. తెలుగు సినిమా పరిధి పెరిగిపోవడంతో.. ఆ దిశగానే బాలకృష్ణ కూడా చూపులు సారిస్తున్నాడు.

బాలకృష్ణ కన్నడ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. సోలోగా కాకుండా మరో స్టార్ సినిమాలో నటించబోతున్నాడు. ఆ నటుడు ఎవరో కాదు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ 125 వ సినిమా భైరతి రనగల్. ఈ సినిమాలో బాలకృష్ణ స్పెషల్ రోల్ చేయబోతున్నారు. త్వరలోనే బాలకృష్ణ తన డేట్స్ ను కేటాయించబోతున్నారని సమాచారం. త్వరలోనే బాలకృష్ణ సోలో హీరోగా కన్నడ సినిమా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!