HomeTelugu Trendingబాలయ్య కొత్త సినిమా ప్రారంభం

బాలయ్య కొత్త సినిమా ప్రారంభం

balakrishna
నందమూరి బాలకృష్ణ 107వ సినిమా ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్ శంకర్, వివి వినాయక్, కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ క్లాప్‌ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

balakrishna1

కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా సినిమా స్క్రిప్ట్‌ని టీమ్‌కి అందజేశారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ కు టైటిల్ ఫిక్స్‌ చేయలేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో రూపొందించనుంది. దర్శకుడు స్క్రిప్ట్‌ను బాగా అధ్యయనం చేసి బాలకృష్ణను పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2022 నుండి ప్రారంభం కానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!