HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌తో బండ్ల గణేష్‌ మూవీ

పవన్‌ కళ్యాణ్‌తో బండ్ల గణేష్‌ మూవీ

Bandla ganesh announces movపవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణష్‌.. ముచ్చటగా మూడోసారి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. తన ట్విట్టర్ లో “నా బాస్ ఓకే అన్నారు.. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు” అని ట్వీట్ చేశాడు. దీనికి పవన్ కల్యాణ్ తో దిగిన లేటెస్ట్ సెల్ఫీను జత చేశాడు. బండ్ల గణేష్‌ పవన్‌కు ఎంత పెద్ద అభిమాని అనే విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌తో ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ సినిమాలు నిర్మించాడు. దానిలో ‘గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు వీరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా స్థాయిలో ఉంటుందో చూడాలి. ఇక గత ఐదేళ్లుగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు బండ్ల గణేష్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu