HomeTelugu Trendingవర్కౌట్లు చేస్తున్న ఫొటోలను షేర్‌ చేసిన యంగ్‌ హీరో..!

వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను షేర్‌ చేసిన యంగ్‌ హీరో..!

12 11జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. తాజాగా కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోకు ఈ మూవీ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. పట్టువదలని విక్రమార్కుడిలా విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

రీసెంట్‌గా ఈ హీరో జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కష్టపడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సిక్స్‌ ప్యాక్‌తో అదరగొడుతున్న ఈ ఫొటోల్లో స్టైలిష్‌గా ఉన్నాడు. రమేష్‌ వర్మతో చేయబోయే సినిమాకోసం బాడీని బిల్డప్‌ చేస్తున్నాడట. ఈ హీరో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!