
Bhairavam Pre-Release Business
తెలుగు ఇండస్ట్రీలో తొలిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా పేరు ‘భైరవం’. ఇది తమిళంలో ఘన విజయం సాధించిన ‘గరుడన్’ రీమేక్. మే 30న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రానికి ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, జీ స్టూడియోస్ ఈ సినిమాకి భారీ ధర చెల్లించి నాన్-థియేట్రికల్ హక్కులు (OTT, శాటిలైట్, డిజిటల్, ఆడియో) సొంతం చేసుకుంది.
రూ.32 కోట్లకు ఈ హక్కులు అమ్ముడవ్వడం ఓ రికార్డ్ గానే చెప్పుకోవాలి. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో మంచి మార్కెట్ కలిగి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయనకు అక్కడ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ ట్రాక్ రికార్డుని బట్టి జీ స్టూడియోస్ ముందుకొచ్చింది.
ఈ డీల్‌తో నిర్మాతలు ఎక్కువశాతం పెట్టుబడి తిరిగించేసారు. కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల అందిస్తున్నారు.
ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోష్‌లో కొనసాగుతున్నాయి. టాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత మూడు యాక్టర్ల కలయికలో వస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్ కట్ చేసిన విధానం విశేషంగా ట్రెండ్ అవుతోంది.
ALSO READ: ఈ ఏడాది 1000 కోట్లు టార్గెట్ గా విడుదల కాబోతున్న Upcoming Indian Films ఇవే..













