HomeTelugu Newsప్రణబ్ ముఖర్జీకి భారత రత్న

ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న

7 21

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించింది. అలాగే ఆరెస్సెస్ నేత నానాజీ దేశ్ ముఖ్, ప్రముఖ గాయకుడు భూపెన్ హజారికాలకు మరణానంతరం భారత రత్నను ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు 40 మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్ ముఖర్జీ సంపూర్ణ అర్హుడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు చేశారని కేసీఆర్ కొనియాడారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu