సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ ట్రైలర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భారత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. సల్మాన్‌ను ఐదు విభిన్నమైన గెటప్స్‌లో చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలీ అబ్బాస్‌ జాఫర్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్‌, దిశా పటానీ హీరోయిన్‌. ప్రభుత్వ అధికారిణిగా కత్రినా పాత్ర, లుక్‌ ఆకట్టుకుంటోంది. సల్మాన్‌ ఉద్యోగం నిమిత్తం ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళతారు. అక్కడ కత్రినా అధికారిణిగా పనిచేస్తుంటారు. ‘మీ పేరేంటి?’ అని కత్రినా అడిగినప్పుడు.. ‘భారత్‌’ అని సల్మాన్‌ సమాధానమిస్తారు. అది విని కత్రినా షాకవుతారు. ‘దేశంపై ప్రేమతో మా నాన్న నాకు ‘భారత్‌’ అని పేరుపెట్టారు. ఆ పేరుకు ముందు, వెనక మరో పేరును జోడిస్తే.. దేశాన్ని అవమానించినట్లు అవుతుంది కదా..’ అంటూ సల్మాన్‌ అమాయకంగా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. భారత్‌ అనే వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిది? అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates