
నటి భూమిక చావ్లా సుమంత్ యువకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రీ మొదలగు సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత కొన్ని ఉమెన్ ఓరియెంటెడ్ సబ్జెక్టులలో కూడా నటించి అదరగొట్టింది. భూమికకు మిస్సమ్మ (2003) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. అవకాశాలు తగ్గిన భూమిక పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత భూమిక నాని ఎంసిఎతో రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భూమిక సమంత ప్రధాన పాత్ర పోషించిన యు టర్న్, అక్కినేని నాగ చైతన్య సవ్యసాచి, తాజాగా బాలయ్య రూలర్ సినిమాతో బిజీగానే గడుపుతోంది. అది అలా ఉంటే భూమిక ఇటీవల మాట్లాడుతూ.. సన్నివేశం డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్లలో నటించడానికి ఏం ఇబ్బంది లేదని పేర్కోంది. అయితే అది సినిమా కథ, మిగితా అంశాలపై ఆధార పడి ఉంటుందని తెలిపింది.













