HomeTelugu Trendingబీబీలో మన రచ్చ మామూలుగా ఉండదు

బీబీలో మన రచ్చ మామూలుగా ఉండదు

Actor Nandu about bigg boss

టాలీవుడ్ నటుడు, సింగర్‌ గీతా మధురి భర్త.. నందు తెలుగు బిగ్ బాస్ సీజన్-4 లో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశాడు. నందు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని షేర్‌ చేశాడు. బిగ్ బాస్ షోలో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి తనకు మద్దతు ఇవ్వాలని ఆయన అభిమానులను అభ్యర్థించారు. ఇక బిగ్‌బాస్ షో సీజన్-4 పోటీదారుల జాబితా గురించి చాలా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో నందు పేరు కూడా వినిపిస్తోంది. కాగా ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ నందు తన ఇన్స్టాగ్రామ్ లో “డార్లింగ్స్ నేను బిబిలో వస్తున్నా బిబిలో మన రచ్చ మామూలుగా ఉండదు. మీకు మరింత వినోదాన్ని పంచుతాను. మీ మద్దతు నాకు కావాలి” అని పోస్ట్ చేసారు. అంతే కాకుండా ప్రేక్షకులను ఆకర్షించడం కోసం మరికొన్ని ఆసక్తికర విషయాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రేపు సాయంత్రం అవికూడా ప్రకటిస్తానని తెలిపారు. ఇక నాడు రేపు ఏం ప్రకటిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

Announcement ☝️

A post shared by Actor Nandu (@that_actor_nandu) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu