HomeTelugu Trendingఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్

ఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్

2 30

హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ షో నుంచి టెలివిజన్‌ తార దేవోలీనా భట్టాచార్య ఎలిమినేట్‌ కానునున్నారు. గత కొద్ది రోజులుగా వెన్ను నొప్పితో బాధ పడుతున్న దేవోలినా.. తనంతట తానే షో నుంచి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. గేమ్‌లో పాల్గొనడానికి ఆమె ఆరోగ్యం సహరించకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ టాస్క్‌లో పాల్గొన్న సమయంలో దేవోలీనాకు వెన్నునొప్పి కలిగింది. దాంతో ఆమె అప్పటి నుంచి ఏ టాస్క్‌లోనూ పాల్గొనడం లేదు. బిగ్‌బాస్‌ కూడా ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. హౌస్‌మేట్స్‌ చేసే పనుల్లో పాల్గొనలా వద్దా అనే నిర్ణయాన్ని ఆమెకే వదిలేశాడు.

అయితే ఇటీవల నొప్పి ఇంకా ఎక్కువకావడంతో ఆమెను బిగ్‌బాస్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతా తిరిగి షోలోకి వస్తుందని అనుకున్నారు. అయితే ఆరోగ్యం సహకరించపోవడంతో ఆమె వాలెంటరీ ఎలిమినేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నిజంగా ఎలిమినేషన్‌ అయ్యారా లేదా తిరిగి షోలోకి వస్తారా అనేది వారాంతంలో తెలియనుంది. కాగా, బిగ్‌బాస్‌ 13లో దేవోలీనా భట్టాచార్య స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌. బయట కూడా ఆమెకు పుల్‌ సపోర్ట్‌ ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!