నయనతార పాత్రలో జాన్వీ కపూర్‌!


బాలీవుడ్‌లో దివంగత నటి శ్రీదేవి కూతురిగా పరిచయమై తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్న జాన్వీ కపూర్. ప్రస్తుతం ‘దోస్తానా 2’ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పింది. ఇది తమిళంలో హిటౌన మూవీ. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా ఆమధ్య ‘కొలమావు కోకిల’ (తెలుగులో కోకో కోకిల) తమిళ చిత్రం మంచి హిట్టయింది. నయనతార నటనకు ఈ చిత్రంలో మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడీ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ని తీసుకున్నారు.ఇక ఈ చిత్రం షూటింగును జనవరి 9 నుంచి పంజాబ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లోనే మొత్తం చిత్రీకరణను పూర్తిచేయాలని యూనిట్ భావిస్తోంది. మరోపక్క, జాన్వీ తాజాగా నటించిన ‘రూహీ అఫ్జా’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates