బిగ్‌బాస్ తెలుగు-4 హైలైట్స్(8 సెప్టెంబర్ 2020)


తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 మూడోరోజు ఎన్టీఆర్‌ సాంగ్‌తో చాలా ఉత్సాహంగా మొదలైంది. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో సభ్యులంతా పాల్గొన్నారు. కళ్యాణి టీచర్‌గా వ్యవహరించగా మిగతావారు స్టూడెంట్స్‌గా చేశారు. టీచర్‌ని స్టూడెంట్స్ బాగా టీజ్‌ చేశారు. టీచర్‌ (కళ్యాణి ) గంగవ్వను అవ్వ నువ్వు 50 సంవత్సరాల నుండి స్కూల్‌లో ఉంటున్నావ్‌ అంది. గంగవ్వ దానికి నువ్వు జీతం తీసుకుంటున్నావ్‌ గానీ పాఠాలు చెప్పడంలేదు. పాస్‌ చేయడం లేదు అని కౌంటర్ ఇచ్చింది. కళ్యాణి ఇంటి సభ్యులందరికీ ఇంటిలో పాటించాల్సిన రూల్స్‌ చెప్పింది. అవి పాటించకపోతే శిక్ష కూడా ఉంటుందని తెలిపింది. ఇంటి పనుల్లో బిజీగా ఉన్న సభ్యులకు ఇంతలో స్పెషల్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అరియానా, అఖిల్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మధ్యలో నోయల్‌ ఫోన్‌ తీసుకున్నాడు. మర్యాదగా మాట్లాడు పొరుగింటి వారైతే మా ఇంటికి వచ్చి తినండి అని ఫోన్ పెట్టేశాడు.
అరియానా మాత్రం ఇది చాలా తప్పు అంటూ నొచ్చుకుంది.

మీ మధ్య ఒక కట్టప్ప ఉన్నారు అంటూ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. కట్టప్ప ఎవరని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం ఓ కార్డుపై రాసి బాక్స్‌లో వేయమన్నాడు. ఆ తర్వాత ఇంట్లో అందరూ ఒక చోట కూర్చుని ఉండగా కల్యాణిని అభిజిత్ కామెంట్ చేశాడు. గంగవ్వ స్టైల్‌ చీర నువ్వు కట్టుకుంటే చచ్చిపోతారు అన్నాడు. దీంతో హర్ట్‌ అయింది కళ్యాణ్‌. గంగవ్వ అఖిల్‌ని నువ్వే కట్టప్ప.. అందరూ నీకే ఓటు వేశారు అన్నది.

ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అదే సమయంలో కట్టప్ప ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని ఓ కన్నేసి ఉంచాలని బిగ్‌బాస్ హెచ్చరించాడు. స్పెషల్ రూమ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులకు బిగ్‌బాస్ ఆదేశాలిచ్చాడు. మీరు పొరుగింటికి వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పాడు. మీరిద్దరు నేరుగా వెళ్లి తేల్చుకోండి అన్నాడు. తర్వాత అరియానా, సోహాల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో గొడవకు దిగారు. అభిజిత్, సోహాల్ మధ్య వార్ జరిగినట్లు రేపటి ప్రోమోలో చూపించాడు బిగ్‌బాస్‌.

CLICK HERE!! For the aha Latest Updates