HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌: ఇంటి సభ్యుల సర్కస్‌ ఫీట్లు

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యుల సర్కస్‌ ఫీట్లు

4 18తెలుగు బిగ్‌బాస్‌-షో చివరకు వస్తున్న కొద్దీ మరింత రంజుగా మారుతోంది. పద్నాలుగో వారానికి గానూ బిగ్‌బాస్‌ ఇచ్చిన నామినేషన్‌ టాస్క్‌.. ఈ సీజన్‌లోనే బెస్ట్‌ టాస్క్‌గా నిలిచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే జోష్‌లో మరో ఆసక్తికర టాస్క్‌ ఇవ్వడానికి బిగ్‌బాస్‌ సిద్ధమయ్యాడు. అందులో భాగంగా నామినేట్‌ అయిన ఇంటి సభ్యులకు కఠినతరమైన టాస్క్‌లు ఇస్తూ వారి బలాబలాలను బేరీజు వేయనున్నాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోడానికి ఇది సువర్ణావకాశం అంటూ.. నామినేషన్‌లో ఉన్న బాబా భాస్కర్‌, వరుణ్‌, శ్రీముఖి, అలీ, శివజ్యోతిలకు భిన్న టాస్క్‌లను ఇచ్చాడు. అభిమానులను అలరించడానికి సర్కస్‌ ఫీట్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు హౌస్‌మేట్స్‌.

తాజా ప్రోమో ప్రకారం.. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇంటి సభ్యులు నానా తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనూ కామెడీ కింగ్‌ బాబా.. పంచ్‌లు విసురుతూ ఇంట్లో నవ్వులు పూయిస్తు​న్నాడు. మరి వీళ్ల ఫీట్లతో జనాల్ని మెప్పిస్తారా? లేక బొక్కబోర్లా పడతారా అన్నది చూడాలి! అయితే ఈ వారం ఎవర్ని పంపించాలన్నది ప్రేక్షకులు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారని తెలుస్తోంది. గత వారం స్వల్ప ఓటింగ్‌ తేడాతో గట్టెక్కిన శివజ్యోతి ఈసారి తప్పించుకోలేదని, బిగ్‌బాస్‌ షోకు బైబై చెప్పే రోజులు ఆమెకు దగ్గర్లోనే ఉన్నాయని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!