చిరు వోల్డ్ గెటప్ ఎలా ఉంటుందో..?

‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తమిళ కత్తి సినిమాకు రీమేక్. ఈ సినిమా హీరో రెండు గెటప్స్ లో కనిపించనున్నారు. ఒకటి యంగ్ లుక్ కాగా.. మరొకటి వోల్డ్ గెటప్. అయితే చిరు సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి కూడా యంగ్ లుక్ మీదే ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. అన్నీ చిరు యంగ్ లుక్ ను ప్రెజంట్ చేస్తూనే పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలై పాటల్లో కూడా ఆయన యంగ్ లుక్ మాత్రమే కనిపించింది. అయితే సినిమాలో సిట్యుయేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది. అందులో మాత్రం ఖచ్చితంగా చిరు వోల్డ్ లుక్ తో కనిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి కూడా చిత్రబృందం ఆ గెటప్ రిలీజ్ చేయకుండా బాగానే ప్లాన్ చేసుకుంది.

‘నీరు నీరు నీరు.. ‘అంటూ సాగే ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించిన తీరు హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ పాటలో కూడా ఆయన వోల్డ్ లుక్ రిలీజ్ చేయకుండా ఉండడం వెనుక ‘ఖైదీ’ టీం ఆ లుక్ బయటకు వస్తే సినిమాకు క్రేజ్ తగ్గుతుందని భయపడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరు ఇప్పటివరకు చాలా సినిమాల్లో వోల్డ్ గెటప్స్ లో కనిపించారు. ఆయనకు ఆ పాత్ర కొత్తేమీ కాదు. ఇక ట్రైలర్ లో అయినా… ఈ గెటప్ ను రివీల్ చేస్తారో.. లేక సినిమాలో చూడమని చెప్తారో.. చూడాలి!