బిగ్ బాస్-3కి మూహుర్తం కుదిరింది


బిగ్ బాస్ బాలీవుడ్ లో సూపర్ ఫేమసైనా రియాలిటీ షో. గత 12 సంవత్సరాలుగా ఈ షోను నిర్వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఇప్పుడు సౌత్ లోను ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ 1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసినపుడు షోకి పాపులారిటీ వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది.

సెకండ్ సీజన్లో నాని హోస్ట్ గా వ్యవహరించారు. సక్సెస్ అయినప్పటికీ.. అనుకున్నంతగా హిట్ కాలేదు. ఇదిలా ఉంటె, బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. గతేడాది కామన్ మ్యాన్ గా ఒకరిని హౌస్ లో తీసుకునే వారు. కానీ, ఇప్పుడు కామన్ మ్యాన్ లేరు. అందరు సెలెబ్రిటీలే. హౌస్ లో పాల్గొనే సెలెబ్రిటీలు ఎవరు అన్నది త్వరలోనే తేలిపోతుంది. ఇక ఈ బిగ్ బాస్ 3 ఫస్ట్ ఎపిసోడ్ జులై 21 వ తేదీన ప్రసారం కాబోతున్నది.