ఒకే జిమ్‌లో నాగార్జున, రకుల్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పోర్చు‌గ‌ల్‌లో జరుగుతోంది. నాగ్, రకుల్ ఇద్దరూ ఫిట్నెస్ ఫ్రీక్స్. అందుకే లొకేషన్ దగ్గర్లో మంచి జిమ్ వెతుక్కుని రోజూ క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ వర్కవుట్స్‌కి సంబందించిన వీడియో ఒకదాన్నిసరదగా నాగ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.