బిగ్‌బాస్‌-4 గ్రాండ్‌ లాంఛ్..‌ ఛానల్‌ లోగో ఛేంజ్‌


తెలుగు అతి పెద్ద రియాలిటి షో బిగ్‌బాస్‌ సీజన్‌-4 ఈ రోజు (సెప్టంబరు 6 ) సాయంత్ర 6 గంటలకు కరోనా నిబంధనల తో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సీజన్‌కు కూడా గత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన టాలీవుడ్‌ హీరో కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నాడు. స్టేజ్‌ పై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగ్‌ కరోనా నిబంధనల మధ్య ఈ షో నిర్వహిస్తున్నాట్లు తన సినిమాలోని పాటల ద్వారా తెలియజేశాడు. మాస్క్‌ ముఖానికి అవసరం ఎంటర్‌టైన్‌మెంట్‌కి కాదు అన్నాడు నాగ్‌. ఈ సారి ఇంటిలో 4 టైమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెవర్‌ బిఫోర్‌అన్నాడు. ముందుగా ప్రొమోలో చూపించిన విధంగా .. నాగ్‌ తండ్రి వృద్ధ నాగ్ కూడా స్టేజ్‌ పై కనిపించాడు.

ఈ సీజన్‌లో స్టేజ్‌ ఆడియన్స్‌ లేరని, స్టాఫ్ మొత్తనికి పీపీ కిట్‌ వేయించినట్లు తెలిపాడు. నాగ్‌ తండ్రి ఈ సారి బిగ్‌బాస్‌ హౌస్‌ని పరిచయం చేశాడు. ఇంటిలోకి వెలిన వృద్ధ నాగ్ ఇక్కడ జరిగే గాసిప్స్‌ గురించి చెప్పాడు. ఈ సారి కరోనా నేపధ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చూపించాడు. 3 సీజన్ల కంటే ఈ సారి హౌస్‌ మరింత పెద్దగా ఉంది. ఈ ఇంట్లో ఓ స్పెషల్ రూమ్‌ కూడా ఉంది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ గొంతు విప్పాడు. వృద్ధ నాగ్‌ తో.. నాగర్జున నాన్నగారు మీరు ఇంటిలో వచ్చినందుకు ధన్యవాథలు అన్నాడు. ఈ సందర్భంగా సరికొత్త వినోదం కోసం స్టార్‌ మా కొత్త లోగో లాంచ్‌ చేశాడు.తమాషా, మాగాణి, పరమానందం, తీన్‌మార్‌అన్నీ కలగలిపి ‘STAR మా’ గా మార్చారు. తెలుగుదనం ఉట్టిపడేలా.. లోగో ఛేంజ్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates