HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ వీరే..

బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ వీరే..

Bigg Boss 4 telugu contesta
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికే మూడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగవ సీజన్ ను రెడీ అవుతోంది. రేపటి నుండి (సెప్టెంబర్‌ 6) ప్రారంభం కాబోతుంది బిగ్‌బాస్‌ సందడి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా 15 మంది కంటెస్టెంట్స్‌ 100 రోజుల పాటు సందడి చేయబోతున్నారు. ఇప్పటికే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్స్‌ అంతా సెప్టెంబర్‌ 3వ తేదీన హోస్‌లోకి వెళ్లిపోయారు. శుక్రవారం నుంచి షూటింగ్‌ మొదలైంది. అంటే ఇప్పటికే గేమ్‌ మొదలైపోయిందన్నమాట.

Bigg Boss 4 telugu contest

ఇప్పటికే బిగ్‌బాస్‌ -4 కంటెస్టెంట్స్‌ వీళ్లే అంటూ రకరకాల పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే అంటూ కొందరి పేర్లు నెటింట్లో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని కొందరు కొట్టిపడేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌-4లో తాము నటించడం లేదంటూ హీరో తరుణ్‌, హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌, కల్పిక గణేశ్, నటి సునైనా, సింగర్‌ సునీత లాంటి వాళ్లు తేల్చి చెప్పారు. అయితే తాజాగా మరో లిస్ట్‌ వైరల్‌ అవుతోంది. బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ పక్కా వీళ్లే అంటూ 15 మంది పేర్లు ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

Bigg Boss telugu 4

వారిలో..
దేత్తడి హారిక (యూట్యూబ్‌ స్టార్‌)
దేవి నాగవల్లి (యాంకర్‌)
గంగవ్వ (యూట్యూబ్‌ స్టార్‌)
ముక్కు అవినాష్‌ (జబర్దస్త్ ఫేం)
మోనాల్‌ గుజ్జార్‌ (హీరోయిన్‌)
అమ్మ రాజశేఖర్‌( సినీ దర్శకుడు)
కరాటే కళ్యాణి (నటి)
నోయల్‌(సింగర్‌)
సూర్యకిరణ్‌ (సినీ దర్శకుడు)
లాస్య (యాంకర్‌)
జోర్దార్ సుజాత (యాంకర్)
తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి)
సయ్యద్ సోహైల్ ,అరియానా గ్లోరీ (యాంకర్‌)
అభిజిత్‌ (లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్ హీరో)
వీరితో పాటు నటి సురేఖ వాణి పేరుకూడా వినిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!