HomeTelugu Trendingఆగస్ట్‌ -15న బిగ్‌బాస్‌ కొత్త ప్రొమో.. కంటెస్టెంట్స్‌ లీస్ట్‌ వైరల్‌

ఆగస్ట్‌ -15న బిగ్‌బాస్‌ కొత్త ప్రొమో.. కంటెస్టెంట్స్‌ లీస్ట్‌ వైరల్‌

Bigg boss

బుల్లితెరపై బగ్‌బాస్‌-5 సందడి మొదలుకానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న మరో ప్రోమో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ ప్రోమో షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎంపిక కూడా పూర్తి చేశారట. ఆగస్ట్‌ 22 నుంచి వారికి క్వారంటైన్‌కు తరలించనున్నట్లు సమాచారం. అక్కడ 15 రోజుల పాటు క్వారంటైన్‌ చేసి, సెప్టెంబర్‌ 5న నేరుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నారట. ప్రతి కంటెస్టెంట్‌కి రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నారట.

అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్‌ మీడియాలో ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది. అందులో యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్‌ నాగార్జుననే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!