Bigg Boss 8 Telugu Bottom 3 contestants:
బిగ్ బాస్ హౌస్‌లో 13 వారాలు బలంగా నిలిచిన పృథ్వి రాజ్ ఇటీవల ఎలిమినేషన్ కి గురయ్యారు. మొత్తం 13 వారాల్లో, అతను 10 వారాలు నామినేషన్‌లో ఉన్నాడు. పృథ్వి ఈ సీజన్‌లో సర్‌ప్రైజ్ ప్యాకేజిగా నిలిచాడు. అతని కోపం తప్ప, బిగ్ బాస్ ఇంట్లో అతని పట్ల పెద్ద వివాదాలు ఎక్కడా కనిపించలేదు.
పృథ్వి హౌస్ నుంచి బయటికి రావడంతో, హౌస్‌లో ప్రస్తుతం 7 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. గ్రాండ్ ఫినాలేకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈ సీజన్‌లో ఫినాలేకు 6 మంది సభ్యులు చేరుకుంటారని అంచనా. దానిలో భాగంగా, వచ్చే వారం ఒక సభ్యుడు ఎలిమినేట్ అవుతారు. ఫినాలే వారం మధ్యలో ఒక ఎమర్జెన్సీ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది.
అవినాష్ ఫినాలే టికెట్ గెలుచుకుని తన స్థానాన్ని సురక్షితంగా చేసుకున్నాడు. మిగతా టాప్ 5 పోటీదారులు గౌతమ్ కృష్ణ, నిఖిల్, ప్రేరణా కంబం, నబీల్ అఫ్రిదీ అని అంచనా వేస్తున్నారు. రోహిణి, విష్ణుప్రియ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ ఖాతాలో ఉండొచ్చు.
గౌతమ్, నిఖిల్ తమ స్థాయిని నిలుపుకొని చాలా బాగా ఆడుతున్నారు. వీరిద్దరిలో ఒకరు విజేత గా నిలిచే అవకాశం ఉంది. ప్రేరణా కంబం కూడా టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. నబీల్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నిఖిల్, గౌతమ్ గ్రాఫ్ స్థిరంగా ఉన్నప్పటికీ, ఇతర పోటీదారుల గ్రాఫ్ లో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఏదేమైనా బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆఖరి తీర్పు కోసం వేచి చూడాలి.
ALSO READ: Nagarjuna కార్ కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!