ఇంటి సభ్యులందరిపై మండిపడ్డ బిగ్‌బాస్‌

సోమవారం జరిగిన బిగ్‌బాస్-2 100వ ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌ పై బిగ్‌బాస్‌ మండిపడ్డాడు. ఇంటి నిబంధనలను ఉల్లంఘించారంటూ సభ్యులందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తరచూ మీరు పేపర్‌పై రాస్తుంటారు అది ఏమిటో వివరణ ఇవ్వాలని కౌశల్‌ను అడిగాడు బిగ్‌బాస్. అలాగే తన దగ్గరున్న పేపర్లను స్టోర్‌ రూమ్‌లో పెట్టాల్సిందిగా ఆదేశించారు. దానికి సమాధానంగా కౌశల్‌ నేను 100 రోజుల్లో జరిగిన జర్నీ, టాస్క్‌లు గురించి రాయడం జరిగిందని, ఎవరెవరు హౌస్‌లో ఎలిమినేట్ అయ్యారో ఆర్డర్, 100 రోజుల్లో హౌస్ మేట్స్ పై నా అభిప్రాయం రాసుకున్నానని కౌశల్ సమాధానం చెప్పాడు.

కౌశల్‌ మీరు ఇలా చేయడం ఇంటి నియమాలను ఉల్లంఘించడం అని మీకు తెలుసా అన్నాడు బిగ్‌బాస్. ఇంటిలో ప్రతి నియమం వెనుక కచ్చితంగా ఓ కారణం ఉంటుంది. ఎవరైనా హౌస్‌లో కొనసాగాలంటే కచ్చితంగా హౌస్ నియమాలను పాటించి తీరాల్సిందే. హౌస్‌లో ఇన్ని రోజులు గడిచాక కూడా కౌశల్‌ మీకు ఇంటి నియమాలు ఇంకా పూర్తిగా అర్ధం కాలేదా అని ప్రశ్నించారు. మీరు తరచూ ఇంటి నియమాల గురించి మాట్లాడుతుంటారు. కానీ పేపర్‌లో రాయడం సరికాదని తెలియదా అన్నారు. అలాగే గీతా మాధురి మైక్‌కు చేయి అడ్డం పెట్టి గుసగుసలు ఆడుతున్నారు. మిగిలిన సభ్యులు కూడా ఏదో ఒక నియమాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు అంటూ ఇంటి సభ్యులందరినీ బిగ్‌బాస్ ఏకి పారేశారు. సభ్యులందరినీ మరోసారి హెచ్చరిస్తున్నానంటూ ఇకనుంచి ఎవరైనా ఇంటి నియమాలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

ఇంటి సభ్యులదంరికీ ఆఖరి నామినేషన్‌ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది. బిగ్‌బాస్‌లో ఫినాలేకు ముందు వరుసగా 3 వారాలు కెప్టెన్ లేకుండా ఉండటం బిగ్‌బాస్‌ చరిత్రలో ఇదే మొదటి సారి అని అన్నారు. సభ్యులు టాస్క్‌లను సాధారణంగా తీసుకుంటూ వాటి ప్రాధాన్యత తెలుసుకోకుండా ప్రవర్తించడం టాస్క్ వెనుక ప్రాముఖ్యత అర్ధం చేసుకోపోవడంతో నిరాశకు గురిచేసిందని బిగ్‌బాస్‌ అన్నారు. వ్యక్తిగతంగా ఆట ఆడకపోగా ఆట ప్రాముఖ్యత కూడా అర్ధం కాలేదని గోచరిస్తుంది. సీజన్‌లో ఆఖరి నామినేషన్ కాబట్టి ఇంటి సభ్యులందరికీ ఫినాలేకు చేరుకునే సామర్థ్యం తెలియజేయడానికి ఇంటి సభ్యులందరినీ నామినేట్ చేస్తున్నానని బిగ్‌బాస్ అన్నారు. ఈ వారం హౌస్ నుంచి బయటకు పంపడానికి నామినేట్ అయిన కౌశల్, గీత, రైడా, తనీష్, సామ్రాట్, దీప్తి అని ప్రకటించారు. సభ్యులంతా రాబోయే 2 వారాల్లో ఆట ప్రాముఖ్యతను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.