HomeTelugu Trendingబాలీవుడ్ మెగాస్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

బాలీవుడ్ మెగాస్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

7 10

బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ జీవితం ఎందరికో ఆదర్శం. సినీ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతం బాలీవుడ్‌లో మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటీవల దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. నేటితో (అక్టోబర్ 11) ఆయన 77వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘నాకు మూడు, నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి నేను ఒక వ్యక్తిని చూస్తూ పెరిగాను. ఆయన కనిపించిన ప్రతిసారి గౌరవంతో పాదాభివందనం చేసేవాడిని. ఆ తర్వాత కొంతకాలానికి అది నాకు అలవాటుగా మారింది. ఇప్పటికీ నేను ఆయన కనిపించిన వెంటనే పాదాభివందనం చేస్తాను. ఆయన్ని నేను ప్రేమతో అమిత్‌ అంకుల్‌ అని పిలుస్తాను. ఆయన నాకు తండ్రితో సమానం. నేను ఆయనతో కలిసి పనిచేసిన మొదటిరోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఏమీ మారలేదు. అమితాబ్‌ బచ్చన్‌ నాకు గొప్ప ఆదర్శం. విజయానికి నిదర్శనంగా మారిన మీలాంటి గొప్పవ్యక్తి గురించి నేను ఏం చెప్పగలను. అమితాబ్‌ లాంటి లెజండ్‌ వేరొకరు లేరు, రారు. జన్మదిన శుభాకాంక్షలు అమితాబ్‌ అంటూ కరణ్‌ జోహర్‌ ట్వీట్‌ చేశారు.

‘అమితాబ్‌ బచ్చన్‌ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నానంటూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, భారతీయ సినిమా లెజెండ్‌గా పేరుపొందిన అమితాబ్‌ బచ్చన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రామ్‌చరణ్‌.. ప్రియమైన అమితాబ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సైనా నెహ్వాల్.. ‘బాలీవుడ్‌ షెహన్‌షా అమితాబ్‌ బచ్చన్‌కి జన్మదిన శుభాకాంక్షలు… మీరు ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానంటూ కిదాంబి శ్రీకాంత్‌.. ‘లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ సర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ నిధి అగర్వాల్‌.. ‘మీరు నిజమైన లెజెండ్‌. మేమంతో గొప్పగా చెప్పుకొనేలా మీరు మాకు ఐకాన్‌గా ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటూ అనుష్క శర్మ
అమితాబ్‌ శతాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ లతా మంగేష్కర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!