మోడీకీ చంద్రబాబే స్వాగతం పలకాలి..

ప్రధాని నరేంద్ర మోడీ… ఏపీ పర్యటనపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. అయితే ఆంధ్రలో ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు స్వాగతం పలకాలని సూచించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు… తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్న ఆయన.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ ను కట్టేది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇక దేవాలయాలు నిధులు పార్టీ ప్రచారాలకు వినియోగిస్తే భక్తుల తరపున బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించిన మాణిక్యాలరావు.. తాను రాజీనామా చేసిన తర్వాత దేవాలయాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.