HomeTelugu Newsఏపీలో సంక్రాంతి సంబరాలు

ఏపీలో సంక్రాంతి సంబరాలు

1 13

ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. డూడూ బసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది. తెలుగు లోగిళ్లు సందడిగా మారాయి. పల్లెల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ఇళ్ల ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు కనువిందు చేస్తున్నాయి. భోగి మంటలు వేసి ఆనందోత్సాహలతో వేడుకలు జరుపుకొంటున్నారు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

పట్టణాల నుంచి స్వగ్రామాలకు తరలివచ్చిన ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. భోగిని పురస్కరించుకుని పలుచోట్ల తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. అంతా కలిసి భోగి మంటల కొత్త వెలుగుల్లో సంక్రాంతికి స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ విశిష్టతను చాటుతూ సంప్రదాయాలను గుర్తు చేసేలా పలుచోట్ల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ఆనందోత్సాహాలతో నగరవాసులు వేడుకలు జరుపుకొంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలోని పెదరావూరులో భోగి వేడుకలు చేసుకున్నారు. పార్టీ నేతలు, అభిమానుల సమక్షంలో ఆయన స్వయంగా భోగి మంట వెలిగించారు.

మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండగలో భాగంగా తొలిరోజు “భోగి”ని వైభవంగా జరుపుకుంటున్నారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. కాసింపింట్ల హెరిటేజ్ పరిశ్రమలో జరిగిన సంక్రాంతి వేడుకలో సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఏటా సంక్రాంతి పండుగను చంద్రబాబు తమ స్వగ్రామం నారావారిపల్లెలో బంధుమిత్రుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి ఈరోజు గ్రామానికి చేరుకోగా, ఆయన కుటుంబ సభ్యులు ముందుగానే నారావారిపల్లెకు చేరుకున్నారు.

2 13

Recent Articles English

Gallery

Recent Articles Telugu