ఆ ఇద్దరు భామల్లో చరణ్ ఐటెమ్ గాళ్ ఎవరు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తున్నాడు. నటన-నిర్మాణం రెండు పనులను కూడా చాకచక్యంతో కానిస్తున్న చరణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో రంగస్థలం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పది కోట్ల బడ్జెట్ తో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో త్వరలోనే మరో షెడ్యూల్ మొదలుకానుంది. ఇది ఇలా ఉండగా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలో నటించడానికి ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలను సంప్రదిస్తున్నట్లు సమాచారం.
కరీనా కపూర్ లేదా ప్రియాంకా చోప్రా వీరిద్దరిలో ఎవరో ఒకరితో ఐటెమ్ సాంగ్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ప్రియాంకా చోప్రాతో చరణ్ కలిసి ఓ సినిమాలో నటించాడు. ఆమెతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రియాంకాను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. కానీ ఆమె హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. కరీనా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే క్రమంలో 
ఉంది. మరి ఈ ఇద్దరిలో చరణ్ పక్కన డాన్స్ చేసే ఆ ముద్దుగుమ్మ ఎవరో.. తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!